BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 26 June 2026, 11:00 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గూగూడు కుళ్లాయిస్వామి ఉత్సవాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీకి ఘన స్వాగతం

ఆంధ్రప్రదేశ్
/ అనంతపురం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 11:00 PM
106 వీక్షణలు

అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడు గ్రామంలో జరుగుతున్న శ్రీ కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా కొనసాగాయి. ఉత్సవాల్లో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి కుటుంబ సమేతంగా పాల్గొని శ్రీ కుళ్లాయిస్వామి, శ్రీ ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు.

అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, మడకశిర ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసా నాయుడు, జిల్లా టీడీపీ నాయకుడు ఆలం వెంకట నరసా నాయుడు కూడా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ప్రజాప్రతినిధుల రాకతో ఉత్సవ ప్రాంగణం సందడిగా మారింది. వారిని ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు ఘనంగా స్వాగతించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ తలారి కుళ్లాయప్ప, సొసైటీ చైర్మన్ మహేష్ నాయుడు, హిత హాస్పిటల్ ఎండీ లక్ష్మీనాయుడుతో పాటు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.