దసరా ఉత్సవాలకు యోగి ఆదిత్యనాథ్‌కు ఆహ్వానం
జాతీయం
విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొనాలని మంత్రి సత్యకుమార్, ఎంపీ కేశినేని చిన్ని విజ్ఞప్తి
విజయవాడ: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కలిశారు. విజయవాడలో నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని ఆయనను ఆహ్వానించారు. నగరంలో నిర్వహించనున్న ‘విజయవాడ ఉత్సవ్ 2.0’లోనూ పాల్గొనాలని కోరారు.
విజయవాడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని జాతీయ స్థాయిలో చాటిచెప్పే లక్ష్యంతో దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0 నిర్వహణకు ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటే ఉత్సవాలకు మరింత ప్రాధాన్యం చేకూరుతుందని పేర్కొన్నారు.