యువకుడు అదృశ్యం.. ఆచూకీ తెలిపితే పారితోషికం
శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
2025 ఆగస్టు 12 నుంచి కనిపించని కోట మధుసూదనరావు
విజయనగరం జిల్లా: సంతకవిటి మండలం చిత్తారాపురం గ్రామానికి చెందిన కోట మధుసూదనరావు (31) అదృశ్యమయ్యాడు. తండ్రి నారాయణరావు కుమారుడైన మధుసూదనరావు 2025 ఆగస్టు 12వ తేదీ నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ హరికృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధుసూదనరావు ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు. ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం అందజేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
సమాచారం అందించాల్సిన ఫోన్ నంబర్లు:
6309990842
6309990814
9550346928
ఆచూకీ తెలిసిన వారు శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.