సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్
ఆంధ్రప్రదేశ్
/
శ్రీ సత్యసాయి
కదిరి: అనంతపురంలోని స్విమ్స్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్న ఎన్‌పీ కుంట మండలం మాజీ జడ్పీటీసీ రాఘవయ్య కుమారుడు సుదర్శన్‌ను కదిరి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ పరామర్శించారు.
సుదర్శన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మక్బూల్.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రంగారెడ్డి, నాయకులు చెన్నేకృష్ణారెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.