BREAKING
thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు thumb ● పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి – గణం నర్సింహ్మా కురుమ thumb ● వికలాంగులను బైండోవర్ చేయించడం ముఖ్యమంత్రి అసమర్థతకు నిదర్శనం thumb ● రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు గుండ్రాతిమడుగు విద్యార్థుల ఎంపిక thumb ● కందగిరి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి thumb ● అర్హులైన పేదలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి thumb ● ఎస్సారెస్పీ కాల్వల్లో పూడిక తీస్తున్నారా? మళ్లీ వేస్తున్నారా? thumb ● 35 ఏళ్ల సామాజిక సేవలకు పంజాల ఐలయ్యకు గౌరవ డాక్టరేట్ thumb ● ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో ‘మా ఇంటి దీపావళి’ వేడుకలు thumb ● గ్రామ ప్రజలతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 09 November 2026, 12:19 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

బుర్రా మధుసూదన్ యాదవ్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
09 Nov, 2026 - 12:19 PM
21 వీక్షణలు

ఎన్నికల్లో అవకాశం కల్పించి సహకరించినందుకు కృతజ్ఞతలు.. ఆయన నాయకత్వంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వెల్లడి

కందుకూరు (ఎన్ టుడే న్యూస్): కందుకూరు నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే, కందుకూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్‌ను కలిశారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయనను కలిసి తమ విజయానికి సహకరించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు తమకు అవకాశం కల్పించడంతో పాటు, విజయం సాధించేందుకు అన్ని విధాలుగా సహకరించిన బుర్రా మధుసూదన్ యాదవ్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటామని పేర్కొన్నారు. తమపై నమ్మకం ఉంచి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఎన్నికల సమయంలో ఆయన అందించిన సహకారం, ప్రోత్సాహం తమకు ఎంతో ఉపయోగపడిందని వారు పేర్కొన్నారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉంటామని, తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

జగనన్న సంక్షేమ పాలనను తిరిగి తీసుకురావాలనే లక్ష్యంతో బుర్రా మధుసూదన్ యాదవ్ నాయకత్వంలో కందుకూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు వెల్లడించారు. ఈ భేటీ సందర్భంగా నాయకులు పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు.