BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

గత ఐదేళ్లలో ఏపీ బ్యాంకుల్లో 341 సైబర్‌ మోసాలు

తెలంగాణ
19 Aug, 2025 - 08:00 PM
273 వీక్షణలు
‎గత ఐదేళ్లలో ఏపీ బ్యాంకుల్లో 341 సైబర్‌ మోసాలు NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర కళ్యాణ్ కుమార్ .. ఏపీలో 2024లో 82 సైబర్‌ బ్యాంకింగ్‌ మోసాలు .. బ్యాంకు లావాదేవీలకు సైబర్‌ సెక్యూరిటీ ఏర్పాట్లు .. డిజిటల్ చెల్లింపులపై RBI మాస్టర్ డైరెక్షన్ .. CERT-In ఎంప్యానెల్డ్ ఆడిటింగ్ సంస్థలతో పర్యవేక్షణ .. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం. ఏలూరు, అగస్టు 18: 2020 నుంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బ్యాంకింగ్‌ రంగంలో సైబర్‌ నేరాల సంఖ్య భారీగా పెరిగిందని కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ అడిగిన ప్రశ్నకు లోక్‌ సభలో కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. సైబర్ భద్రతకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)కు చెందిన సైబర్ సెక్యూరిటీ & ఐటీ రిస్క్ గ్రూప్ (CSITE) నిరంతరం పర్యవేక్షణ చేస్తుందని, సైబర్ భద్రతా చట్రాన్ని బలోపేతం చేయడానికి వివిధ సర్క్యులర్‌లు/ మార్గదర్శకాలను ఆర్బీఐ జారీ చేస్తోందని మంత్రి తెలిపారు. ఎంప్యానెల్ చేయబడిన 200 సంస్థల ద్వారా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) భారతీయ బ్యాంకింగ్ రంగంలోని వివిధ సంస్థల కంప్యూటర్ సిస్టమ్‌లు, నెట్‌వర్క్‌లు, వెబ్‌సైట్‌లు, క్లౌడ్ అప్లికేషన్‌లను నిరంతరం ఆడిటింగ్‌ చేస్తోందని, ఈ సంస్థలు గత ఐదేళ్లలో 29,751 ఆడిట్‌లను నిర్వహించాయని, ఏమైనా లోపాలు గమనిస్తే వెంటనే సంబంధిత బ్యాంకులకు తెలియచేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించి గత ఐదేళ్లలో జరిగిన బ్యాంకు సైబర్‌ మోసాలను పరిశీలిస్తే 2020 లో 36, 2021 లో 59, 2022లో 98, 2023లో 66, 2024లో 82 సైబర్‌ నేరాలు నమోదవ్వగా, ఈ ఐదేళ్లలో ఖాతాదారులు నష్టపోయిన మొత్తం విలువ 132.97 కోట్లు అని కేంద్ర మంత్రి పంకజ్‌ చౌదరి వివరించారు. Follow us on Website Facebook Instagram YouTube