BREAKING
thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం
Date of Publish : 25 August 2026, 02:29 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Aug, 2026 - 02:29 PM
95 వీక్షణలు

తిరువూరులో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా ఇళ్ల స్థలాలు, పేదల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన.. డిమాండ్లతో మెమోరాండం సమర్పణ

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, తిరువూరు:

పేదల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయూ ఆధ్వర్యంలో మంగళవారం తిరువూరులో ధర్నా నిర్వహించారు. తిరువూరు మండల వ్యవసాయ కార్మిక సంఘం కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ఈ ఆందోళనలో నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం తహసీల్దార్ చంద్రమౌళికి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు తూము కృష్ణయ్య మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

పట్టణ ప్రాంతాల్లో అర్హులైన పేదలకు రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. గతంలో మంజూరైన ఇళ్ల స్థలాల్లో లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేందుకు అవసరమైన మార్గాలు, సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే ఎస్సైన్మెంట్ భూములను 22వ నంబర్ జాబితా నుంచి తొలగించి అసలు వన్‌బీ రికార్డులు అందించాలని, పేదలు సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మాలపాటి ఉదయ్, ఎస్‌కే సుభాని, మాదాసు ప్రసాద్, గురువులు వెంకటేష్, సత్యం తదితరులు పాల్గొన్నారు.