BREAKING
thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం
Date of Publish : 25 August 2026, 11:19 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హెడ్ కానిస్టేబుల్ ఇంట్లోనే చోరీ.. పోలీసుల ఇళ్లనే టార్గెట్ చేసిన దొంగలు

ఆంధ్రప్రదేశ్
/ కర్నూలు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Aug, 2026 - 11:19 AM
97 వీక్షణలు

హెడ్ కానిస్టేబుల్ ఇంట్లోనే చోరీ.. పోలీసుల ఇళ్లనే టార్గెట్ చేసిన దొంగలు

కర్నూలు, ఆగస్టు 25:

కర్నూలు నగరంలోని శ్రీనివాస నగర్‌లో దొంగలు రెచ్చిపోయారు. పోలీసు సిబ్బంది ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. హెడ్ కానిస్టేబుల్ మహేష్, ఆర్‌ఎస్‌ఐ సుబ్బయ్య ఇళ్లలో తాళాలు పగులగొట్టి భారీగా బంగారం, వెండి ఆభరణాలు, నగదు అపహరించారు.

హెడ్ కానిస్టేబుల్ మహేష్ ఇంట్లో నుంచి సుమారు 23 తులాల బంగారం, 6 తులాల వెండి ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. అలాగే ఆర్‌ఎస్‌ఐ సుబ్బయ్య ఇంట్లో 5 తులాల బంగారం, 5 తులాల వెండి, రూ.30 వేల నగదును అపహరించారు.

తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి దొంగలు పక్కా ప్రణాళికతో చోరీలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకే ప్రాంతంలో పోలీసుల ఇళ్లలో వరుసగా దొంగతనాలు జరగడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ అనుమానితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.