BREAKING
thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం
Date of Publish : 25 August 2026, 11:52 am
Posted by : ఉపారపు లక్ష్మణ్

వెల్గటూర్ మండలంలో ఆటోల స్వచ్ఛంద బంద్

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
25 Aug, 2026 - 11:52 AM
63 వీక్షణలు

వెల్గటూర్ మండలంలో ఆటోల స్వచ్ఛంద బంద్ ఆటో కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తోంది: అధ్యక్షులు జూపాక కుమార్

వెల్గటూర్ మండలంలో ఆటోల స్వచ్ఛంద బంద్

ఆటో కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తోంది: అధ్యక్షులు జూపాక కుమార్

వెల్గటూర్ 

తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ పిలుపు మేరకు, జగిత్యాల జిల్లా ఆటో యూనియన్ ఆదేశాల ప్రకారం ఉమ్మడి వెల్గటూర్ మండలంలో డీజిల్ ఆటో రిక్షా కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఆటోలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. సంఘ మండల అధ్యక్షులు జూపాక కుమార్ నేతృత్వంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా అధ్యక్షులు జూపాక కుమార్ మాట్లాడుతూ... ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల ముందు ఆటో డ్రైవర్లకు ఏటా ₹12,000 ఇస్తామని వాగ్దానం చేసి, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం దారుణమన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించడంతో ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బతిని, వారి కడుపు కొట్టినట్లయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రోడ్లపై ఎలక్ట్రిక్ ఆటోలను కూడా ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉండటం వల్ల సాధారణ ఆటో డ్రైవర్లు మరిన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టబడతారని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వానికి ఆటో కార్మికుల ప్రధాన డిమాండ్లు:

ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న ₹12,000ల ఆర్థిక సాయాన్ని వెంటనే విడుదల చేయాలి.

ఫ్రీ బస్ పథకం వల్ల ఉపాధి కోల్పోతున్న ఆటో కార్మికులను ఆదుకోవాలి / ఉపాధి భద్రత కల్పించాలి.

ఎలక్ట్రిక్ ఆటోలను రోడ్లపై ప్రవేశపెట్టే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి.

పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నందున దానికి అనుగుణంగా ఆటో ఛార్జీలు పెంచుకునేందుకు చట్టబద్ధమైన వెసులుబాటు కల్పించాలి.

ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

కార్యక్రమంలో పాల్గొన్న పలువురు నాయకులు, ఆటో డ్రైవర్లు:

ఈ స్వచ్ఛంద బంద్ మరియు నిరసన కార్యక్రమంలో సిలివేరి తిరుపతి, బిడారి శ్రీనివాస్, పోరండ్ల శేఖర్, సంఘ శ్రీనివాస్, మూగల భాను, బైరం శ్రీనివాస్, బోరే రమేష్, గాదాసు లక్ష్మణ్, అనుమాల నారాయణ, కుసనపల్లి దుర్గయ్య, పంజాల రాజేందర్, పిట్టల సంతోష్, పొన్నం వెంకటేష్, కొల్లూరి నరేందర్, బాదం సత్తయ్య, చింతకింది సత్యం, సింగం రమేష్, క్యాతం విద్యాసాగర్, వేల్పుల గంగారం, సలాది ప్రవీణ్, గడ్డం రవి, గౌరిశెట్టి భూపతి, బెత్తెపు రాజారావు, మేకల సాగర్, ఎర్ర గోకుల నరేష్, సలాది మల్లేష్, గాదాస్ రాజేశం, లక్కం ప్రశాంత్, చిప్పరి ప్రశాంత్, లక్కం శ్రీకాంత్, లక్కం చందు, బొమ్మగాని ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.