BREAKING
thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● తలసాని శ్రీనివాస్ ను కలిసిన అఖిల భారత యాదవ సంఘము సభ్యులు thumb ● చిత్తూరులో వైసీపీ లీగల్ సెల్ టాస్క్‌ఫోర్స్ సమావేశం
Date of Publish : 25 August 2026, 11:19 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో గిరిజన గురుకుల ఉద్యోగులకు శుభవార్త..

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Aug, 2026 - 11:19 AM
68 వీక్షణలు

ఏపీలో గిరిజన గురుకుల ఉద్యోగులకు శుభవార్త.. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు

అమరావతి: ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీచింగ్, నాన్‌ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ గిరిజన సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు జీఓ నంబర్‌ 33ను ప్రభుత్వం విడుదల చేసింది. జులై 2026 నుంచి పదవీ విరమణకు వచ్చే ఉద్యోగుల సేవలను కొనసాగించేందుకు అనుమతులు ఇచ్చింది.

అయితే పదవీ విరమణ వయసు పెంపునకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. తిరిగి విధుల్లో చేరిన కాలానికి సంబంధించిన వేతన బకాయిలు చెల్లించబోమని స్పష్టం చేసింది. అలాగే ఇప్పటికే గ్రాట్యుటీ, పెన్షన్‌ పొందిన ఉద్యోగుల నుంచి జీఓ నంబర్‌ 45 ప్రకారం రికవరీ చేయాలని ఆదేశించింది.

గిరిజన సంక్షేమ గురుకుల ఉద్యోగుల సర్వీస్‌ రూల్స్‌లో అవసరమైన సవరణలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. ఈ నిర్ణయంతో పదవీ విరమణకు చేరువలో ఉన్న పలువురు గురుకుల ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది.