BREAKING
thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● శ్రీశైలం జలాలు తగ్గుముఖం.. నీటి నుంచి బయటపడుతున్న సంగమేశ్వరాలయం thumb ● నంద్యాలలో వైద్య, ఆరోగ్య శాఖల కాంట్రాక్ట్ ఉద్యోగుల ధర్నా మూడో రోజుకు thumb ● మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం thumb ● జైలు నుంచి విడుదలైన వాసుదేవ యాదవ్‌కు అఖిల భారత యాదవ మహా సంఘం సంఘీభావం
Date of Publish : 25 August 2026, 02:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తల్లిదండ్రుల చొరవకు అభినందనల వెల్లువ..

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Aug, 2026 - 02:28 PM
175 వీక్షణలు

తల్లిదండ్రుల చొరవకు అభినందనల వెల్లువ.. ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యమే బలం ఎంఈవో 1మాసగిరి శ్రీనివాస్ 

మంగపేట ప్రాథమిక పాఠశాలకు రూ.15 వేలతో స్మార్ట్ టీవీ అందించిన తల్లిదండ్రులు.. డిజిటల్ బోధనకు కొత్త ఊపిరి

చాట్రాయి మండలం చీపురుగూడెం పంచాయతీ పరిధిలోని మంగపేట ప్రాథమిక పాఠశాలలో అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రజల సహకారం ఎంత కీలకమో చాటిచెప్పేలా విద్యార్థుల తల్లిదండ్రులు ముందుకు వచ్చి తమ వంతు బాధ్యతను నిర్వర్తించారు.

పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులంతా కలిసి సుమారు రూ.15 వేల వ్యయంతో స్మార్ట్ టీవీని కొనుగోలు చేసి పాఠశాలకు అందించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బోధన అందించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు తీసుకున్న ఈ నిర్ణయం పాఠశాల అభివృద్ధికి మరింత తోడ్పడుతుందని పలువురు అభినందించారు.

స్మార్ట్ టీవీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారులు మాసగిరి శ్రీనివాస్, బ్రహ్మాచారి హాజరై టీవీని ఆన్ చేసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గణేష్‌కు అందించారు.

ఈ సందర్భంగా ఎంఈఓ-1 శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, వాటి అభివృద్ధిలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని అన్నారు. పిల్లల భవిష్యత్తుకు పునాది వేసే పాఠశాలలను ప్రతి ఒక్కరూ తమ సొంత ఆస్తిలా భావించి సంరక్షించుకోవాలని సూచించారు.

"ప్రజల సహకారం ఉంటే ప్రభుత్వ పాఠశాలలు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాయి. తల్లిదండ్రులు చూపించిన చొరవ మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది" అని తెలిపారు. స్మార్ట్ టీవీ అందించిన తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఎంఈఓ-2 బ్రహ్మాచారి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన కొనసాగుతోందని, ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వస్తే విద్యార్థుల అభ్యసన సామర్థ్యం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.

పాఠశాలకు స్మార్ట్ టీవీ అందించడం ద్వారా డిజిటల్ విద్యకు మరింత ప్రోత్సాహం లభించనుంది. పాఠ్యాంశాలను దృశ్యరూపంలో అర్థం చేసుకునే అవకాశం విద్యార్థులకు కలగడంతో చదువుపై ఆసక్తి పెరుగుతుందని ఉపాధ్యాయులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్, ప్రధానోపాధ్యాయుడు గణేష్, ఉపాధ్యాయులు రాంబాబు, స్వర్ణ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. తల్లిదండ్రుల సహకారంతో మంగపేట ప్రాథమిక పాఠశాల అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.