BREAKING
మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ మహిళలు, బాలల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం తమ్మన శ్రీనివాస్‌పై అక్రమ కేసులు పెట్టడం కక్ష సాధింపు హైదరాబాద్ నగరం భిన్న సంస్కృతుల సమ్మేళనం స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల పొట్ట కొడుతున్న రాంకీ సంస్థను రద్దు చేయాలి: CITU కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి: సీపీఎం వరంగల్ కలెక్టరేట్ వద్ద బిఆర్ఎస్ మహిళల ఆందోళన సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఘన నివాళులు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతిభకు ప్రశంసాపత్రం ఘనంగా మంచిర్యాల నడిపెల్లి దివాకర్ రావు జన్మదిన వేడుకలు 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మంచిర్యాల జిల్లా లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
www.ntodaynews.com

వేసవి హాకీ శిక్షణ శిబిరం ప్రారంభం

తెలంగాణ
01 May, 2025 - 12:48 AM
388 వీక్షణలు
వేసవి హాకీ శిక్షణ శిబిరం ప్రారంభం (NTODAY NEWS) నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో ఉరుమడ్ల గ్రామంలో వేసవి హాకీ శిక్షణ శిబిరం ఘనంగా ప్రారంభించారు నల్గొండ జిల్లా క్రీడా మరియు యువజన శాఖ ఆధ్వర్యంలో ఉరుమడ్ల గ్రామంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో భారత జాతీయ క్రీడ అయిన హాకీ శిక్షణను మే 1 నుండి జూన్ 6వ తేదీ వరకు ఉచిత శిక్షణను ఇస్తున్నట్లు హాకీ కోచ్ గంగాపురం రాము తెలిపారు హాకీ క్రీడను చిట్యాల మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పల్లపు బుద్ధుడు గురువారం ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాకీ ఉచిత శిక్షణ శిబిరం తమ గ్రామంలో ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమని, క్రీడల వల్ల మానసిక శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయని వాటి వల్ల ఉన్నత శిఖరాలకు అధిరోహించవచ్చని భవిష్యత్తులో క్రీడా విభాగంలో ఉన్నత ఉద్యోగాలు సాధించవచ్చు అని తెలియజేశారు ఈ ఉచిత శిక్షణకు హాజరైన విద్యార్థులకు పట్ల.నరసింహ స్వల్పాహారాన్ని అందజేశారు .ఈ కార్యక్రమంలో చిట్యాల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్చార్జ్, పట్ల జనార్ధన్, బి ఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఉయ్యాల నాగరాజు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు జరపాల శ్రీను, టిఆర్ఎస్ పార్టీ నాయకుడు సాగర్ల వెంకన్న ,అజీముద్దీన్, వ్యాయామ ఉపాధ్యాయుడు ఎలుగు చంద్రశేఖర్, వ్యాయామ ఉపాధ్యాయురాలు సుంకరి ఝాన్సీ,, ఉపాధ్యాయుడు సాగర్ల లింగస్వామి, గ్రామంలోని యువత విద్యార్థినీ విద్యార్థులు, క్రీడాభిమానులు క్రీడాకారులు , గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube