BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 02 August 2026, 06:29 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

2-3 నెలల్లో ఉయ్యూరు టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తాం: వైవీబీ రాజేంద్రప్రసాద్

ఆంధ్రప్రదేశ్
/ కృష్ణా
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Aug, 2026 - 06:29 PM
64 వీక్షణలు

కృష్ణా జిల్లా, ఉయ్యూరు: ఉయ్యూరులో నిర్మాణంలో ఉన్న టిడ్కో ఇళ్లను మరో రెండు నుంచి మూడు నెలల్లో పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఆదివారం ఉయ్యూరు టౌన్ పార్టీ అధ్యక్షుడు జంపాన గురునాధరావు ఆధ్వర్యంలో నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా 14వ వార్డులో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ, 2014-19 మధ్య ప్రారంభించి 80 శాతం పూర్తయిన టిడ్కో ఇళ్ల నిర్మాణాలను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి నిలిపివేసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులను మళ్లీ ప్రారంభించామని, మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి రెండు లేదా మూడు నెలల్లో లబ్ధిదారులకు ఇళ్లను అందిస్తామని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో ఇళ్ల పూర్తి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు జంపాన పూర్ణచంద్రరావు, అబ్దుల్ కుదూస్, జిల్లా తెదేపా ఉపాధ్యక్షుడు వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్, సీనియర్ నాయకుడు రత్నం బుజ్జి, నాయకులు జంపాన వీర శ్రీనివాస్, 14వ వార్డు కౌన్సిలర్ దుర్గాప్రసాద్, మాజీ కౌన్సిలర్లు పరిమి సలోమి సంతోషి, తెనాలి పద్మావతి, కోరాడ వెంకటలక్ష్మి, నడిమింటి పైడయ్య, మాదినేని జ్యోతి, చలపాటి మణికంఠ, బొర్రా సుబ్బారావు, లక్ష్మణరావు, కటారి తిరుపతిరావు, రామనోళ్ల శ్రీకాంత్, చింతయ్య, జంపాన అర్జున్‌రావు, ఆరేపల్లి సుబ్బారావు, రాజులపాటి వెంకట్, ఆశాదేవి, మోదుగు కుటుంబరావు, కొలగాని సాంబశివరావు, చిట్టీ తదితరులు పాల్గొన్నారు.