వరంగల్‌లో 35 అడుగుల పర్యావరణహిత వినాయక విగ్రహం
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
వరంగల్: వరంగల్ చౌరస్తాలోని గీతా మందిర్ దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన 35 అడుగుల భారీ వినాయక విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది. సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆకృతిలో ఈ విగ్రహాన్ని రూపొందించారు.
సుమారు 5 వేల పట్టు చీరలను వినియోగించి పర్యావరణహితంగా గణనాథుడి విగ్రహాన్ని తీర్చిదిద్దినట్లు నిర్వాహకులు తెలిపారు. విభిన్న ఆకృతిలో రూపొందించిన విగ్రహాన్ని దర్శించుకునేందుకు వరంగల్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.
వినాయక విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో గీతా మందిర్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.