BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 14 August 2026, 09:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

40 ఏళ్ల పసుపు జెండా ప్రస్థానం.....

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Aug, 2026 - 09:17 PM
109 వీక్షణలు

40 ఏళ్ల పసుపు జెండా ప్రస్థానం.. యనమద్ది నాగమల్లేశ్వరరావు తిరిగి టీడీపీలోకి

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం చింతలనర్వ

చింతలనర్వ గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు యనమద్ది నాగమల్లేశ్వరరావు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా పసుపు జెండాను మోస్తూ పార్టీ కోసం పనిచేసిన ఆయన గతంలో చింతలనర్వ గ్రామ సర్పంచిగా, సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా, తెలుగు యువత గంపలగూడెం మండల అధ్యక్షుడిగా, ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా పలు బాధ్యతలు నిర్వహించారు.

గత రెండేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న యనమద్ది నాగమల్లేశ్వరరావు రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ విధానాలకు ఆకర్షితులై తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు. తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రజా సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషి, అభివృద్ధి కార్యక్రమాలు కూడా తనను ఆకర్షించాయని పేర్కొన్నారు.

శుక్రవారం చింతలనర్వ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు యనమద్ది నాగమల్లేశ్వరరావుకు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకుడు తిరిగి పార్టీలోకి రావడం ఆనందంగా ఉందన్నారు. అనుభవజ్ఞులైన నాయకుల సూచనలు, సలహాలతో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం సమష్టిగా ముందుకు సాగుతామని తెలిపారు.

కష్టకాలంలో కూడా పార్టీ సిద్ధాంతాలను నమ్మి జెండాను మోసిన నాయకులు, కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీలో ఎల్లప్పుడూ తగిన గౌరవం ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, సీనియర్ నాయకులు, గ్రామ ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.