BREAKING
హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ఎల్లపుడు కృషి చేద్దాం. రామన్నపేటలో చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం కేంద్ర కనీస వేతన సలహా బోర్డులో సీఐటీయు కు ప్రాతినిధ్యం కల్పించాలి మట్టి గణపతులనే ప్రతిష్టించాలని, పర్యావరణాన్ని కాపాడాలని హెచ్ఎండిఏ ఏఈఈ నితీష్ రెడ్డి పిలుపు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి పల్నాడు: రొంపిచర్ల లో సంఘం డైరీ బోనస్ లు పంపిణీ చాకలి ఐలమ్మ ఆశయ సాధనకు ఎల్లపుడు కృషి చేద్దాం. రామన్నపేటలో చాకలి ఐలమ్మ, సత్తెనపల్లి రామకృష్ణ వర్ధంతి కార్యక్రమం
Date of Publish : 10 September 2026, 06:08 pm
Posted by : ఈడూరి డేవిడ్

500 మంది విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు

ఆంధ్రప్రదేశ్
Reporter
ఈడూరి డేవిడ్ గోపాలపురం నియోజకవర్గ ప్రతినిధి
10 Sep, 2026 - 06:08 PM
1 వీక్షణలు

500 మంది విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు

50 మందికి దృష్టిలోపం గుర్తింపు – ఉచితంగా కళ్లజోళ్ల పంపిణీ

తూర్పుగోదావరి జిల్లా దూబచర్ల: విద్యార్థుల ఆరోగ్యం, కంటి సంరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన వారికి వైద్య సహాయం అందించాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ దూబచర్ల మరియు పార్డ్ ఇండియా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు.

దూబచర్లలోని ఎలైట్ పబ్లిక్ స్కూల్ ప్రాంగణంలో, శ్రీమతి రాజేశ్వరీ రామకృష్ణన్ లయన్స్ నేత్రవైద్యశాల సహకారంతో ఈరోజు ఉదయం 10 గంటలకు శిబిరం నిర్వహించారు.

ఈ సందర్భంగా సుమారు 500 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో సుమారు 50 మంది విద్యార్థులకు దృష్టిలోపం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వారికి అవసరమైన కంటి పరీక్షలు నిర్వహించి, వైద్యుల సూచనల మేరకు ఉచితంగా కళ్లజోళ్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, చిన్న వయసులోనే విద్యార్థుల కంటి ఆరోగ్యాన్ని పరీక్షించడం ద్వారా దృష్టి సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. విద్యార్థులు పుస్తకాలు చదవడం, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు వంటి డిజిటల్ పరికరాలను ఉపయోగించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, దృష్టిలోపం ఉన్న వారికి ఉచితంగా కళ్లజోళ్లు అందించడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు పాఠశాల యాజమాన్యం నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో నల్లజర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాతిన సత్యనారాయణ, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ కూచిపూడి ఉదయభాస్కరరావు, పార్డ్ ఇండియా జాతీయ అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు, లయన్స్ క్లబ్ సెక్రటరీ నెక్కంటి వెంకటేష్, ట్రెజరర్ మద్దుల శ్రీనివాసరావు, చీమకుర్తి కృష్ణ ప్రసాద్, ఎలైట్ స్కూల్ ప్రతినిధులు  గారపాటి సుబ్బారావు, యలమర్తి సుదర్శన్, మద్దాల రాంబాబు, సోమిశెట్టి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇటువంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.