తిరువూరు శ్రీనిధి టెక్నో స్కూల్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, తిరువూరు: శ్రీనిధి టెక్నో స్కూల్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకల అనంతరం వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాల మధ్య వినాయకుడి నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు క్రమశిక్షణతో, భక్తిశ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొన్నారు. నిమజ్జన వేడుకల సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ సూర్రెడ్డి సురేష్ బాబు, కరస్పాండెంట్ ముత్యాల కిషోర్ బాబు, ప్రిన్సిపాల్ రంగు వెంకట నారాయణ, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
వినాయకుడి ఆశీస్సులతో విద్యార్థులు విద్యా రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, విజయాలు సాధించాలని పాఠశాల యాజమాన్యం ఆకాంక్షించింది.