www.ntodaynews.com
రామన్నపేట కోర్టులో బాల్య వివాహాల చట్టాలపై ప్రత్యేక సదస్సు
తెలంగాణ
రామన్నపేట కోర్టులో బాల్య వివాహాల చట్టాలపై ప్రత్యేక సదస్సు
NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట - సీనియర్ సివిల్ జడ్జి జి.సబిత అధ్వర్యంలో ఏర్పాటు - హాజరైన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మరియు సెంకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ జడ్జీ, న్యాయవాదులు రామన్నపేట సీనియర్ సివిల్ కోర్టు అవరణంలో బాల్య వివాహాలపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. రామన్నపేట సీనియర్ సివిల్ కోర్టు జడ్జి జి.సబిత అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శిరీష, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ జడ్జి డి.సత్తయ్య, జిల్లా న్యాయ సహాయ న్యాయవాది ఎస్. సాయి శ్రీనివాస్ లు హాజరయ్యారు. ఈ సదస్సు నందు వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాలతో, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ఇంకా కూడా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు జరిగిన సర్వే లో తేలినట్లు, ఇలా బాల్య వివాహాలు జరగకుండా ఉండాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ''బాల్ వివాహ్ ముక్తి భారత్ ''అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు.
గ్రామీణ ప్రాంతాలలో ఆర్ధిక, సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ మొత్తం లో వివాహాలు జరుగుతున్నట్లు, ఇలా బాల్య వివాహాలు జరగడం వల్ల చిన్న వయస్సు వారికి వచ్చే అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటదని, బాల్య వివాహాలు చేసిన వారికి, చేసుకున్న వారికి, సహకరించిన వారికి ఎలాంటి శిక్షలు పడుతాయో తెలిపారు. వాటిని ఆరికట్టడం కోసమే ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ సదస్సు లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమకు తాము ప్రతిజ్ఞ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతిజ్ఞ అనంతరం ప్రతి ఒక్కరూ పోస్టర్ నందు ఫొటో గ్యాలరీ లో ఫొటో దిగి, సిగ్నేచర్ కాంపెయిన్ లో పోస్ట్ పై సంతకాలు సేకరణ చేయించారు. ఈ సదస్సు హాజరైన ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో నా కుటుంబంలో, చుట్టూ పరిసర ప్రాంతాలు లేదా సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూసుకుంటానని, బాల్య వివాహం ప్రయత్నం జరిగితే పంచాయితీ లేదా ప్రభుత్వం అధికారులకి సమాచారం నివేదిస్తామని, బాల్య వివాహ రహిత భారత్ సృష్టికి నేను మద్దతు ఇస్తానని ప్రతిజ్ఞ చేశారు. బాల్య వివాహాలు ఆరికట్టడం లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంఏ మస్జిద్, సీనియర్ న్యాయవాదులు, సర్వీసెస్ టీమ్ సిబ్బంది, సభ్యులు, అంగన్ వాడి కేంద్రాల సూపర్వైజర్, టీచర్లు, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది, కోర్టుకు హాజరైన ప్రజలు, లీగల్ సెల్ సభ్యులు బత్తుల గణేష్, కోక సబిత, కానుగాంటి శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube