BREAKING
thumb పల్నాడు జిల్లా ఎస్పీగా జగదీష్ ఆదహళ్లి బాధ్యతల స్వీకరణ thumb మైలేజ్ కోసం కాదు.. ప్రజల కోసం పని చేయాలి thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb పల్నాడు జిల్లా ఎస్పీగా జగదీష్ ఆదహళ్లి బాధ్యతల స్వీకరణ thumb మైలేజ్ కోసం కాదు.. ప్రజల కోసం పని చేయాలి thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
Date of Publish : 24 September 2026, 07:44 pm
Posted by : కూనురు మధు

అమృత ప్రణయ్ హత్య కేసులో A4 అబ్దుల్ బారీ మృతి

తెలంగాణ
/ నల్గొండ
24 Sep, 2026 - 07:44 PM
0 వీక్షణలు

NTODAY NEWS: నల్లగొండ 

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సంచలనం సృష్టించిన అమృత–ప్రణయ్ హత్య కేసులో A4 నిందితుడిగా జీవిత ఖైదు అనుభవిస్తున్న అబ్దుల్ బారీ మృతి చెందినట్లు సమాచారం. చర్లపల్లి జైలులో ఉన్న ఆయన గురువారం గుండె నొప్పితో అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. జైలు సిబ్బంది వెంటనే అబ్దుల్ బారీని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రిలో ఉంచారు. నల్లగొండ పట్టణంలోని ప్యారసభాగ్ కాలనీకి చెందిన అబ్దుల్ బారీ గతంలో హరేన్ పాండే హత్య కేసులోనూ జైలు శిక్ష అనుభవించినట్లు సమాచారం. అనంతరం మిర్యాలగూడలో జరిగిన అమృత–ప్రణయ్ హత్య కేసులో A4గా శిక్షకు గురై జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అబ్దుల్ బారీ మృతికి సంబంధించిన పూర్తి వివరాలు, మృతికి గల కారణాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.