BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 02 July 2026, 06:21 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆధార్ నంబర్‌తోనే ఎరువుల కేటాయింపు.. రైతులకు మరింత సులభతరం ఏవో బి శివశంకర్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 06:21 PM
113 వీక్షణలు

చాట్రాయి మండల రిపోర్టర్ గోళ్ళ సత్యనారాయణ 

చాట్రాయి, జూలై 2: రైతులకు ఎరువుల పంపిణీలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏపీ ఎయిమ్స్ (APAIMS) 2.0 విధానం రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారుతోందని మండల వ్యవసాయ అధికారి శివశంకర్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం చాట్రాయి మండలంలోని నరసింహారావుపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్)ను ఆయన సందర్శించి యూరియా, డీఏపీ ఎరువుల పంపిణీ ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన శివశంకర్, ఆధార్ నంబర్ నమోదు చేసి ఓటీపీ ధ్రువీకరణ పూర్తి చేసిన వెంటనే రైతులు తమ పంట విస్తీర్ణం, పంట రకం ఆధారంగా ప్రభుత్వం కేటాయించిన ఎరువుల వివరాలను నేరుగా తెలుసుకునే అవకాశం ఉందన్నారు. దఫాల వారీగా ఎంత డీఏపీ, ఎంత యూరియా కేటాయించబడిందో వెబ్‌సైట్‌లో స్పష్టంగా కనిపిస్తుందని, దీంతో ఎరువుల కోసం రైతులు అనవసరంగా తిరిగే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు.

ప్రత్యేకంగా కౌలు రైతులు, వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాని భూములను సాగు చేస్తున్న రైతులు, ఇంకా పట్టాదారు పాస్‌బుక్ పొందని సాగుదారులకు కూడా ఈ విధానం ద్వారా ఎరువులు అందుబాటులోకి రావడం ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమని ఆయన తెలిపారు. రైతులు తమ సమీప రైతు సేవా కేంద్రాలను సంప్రదించి పంటల వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని, వివరాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే గ్రామ వ్యవసాయ, ఉద్యానవన సహాయక అధికారుల ద్వారా వెంటనే సవరించుకోవచ్చని సూచించారు.

రైతులకు సకాలంలో ఎరువులు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని, ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి శివశంకర్ పిలుపునిచ్చారు.