BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 15 May 2026, 07:26 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆహార భద్రతా ఉల్లంఘనలపై కఠిన చర్యలు.. రూ.6.5 లక్షల జరిమానా విధించిన జేసీ విద్యాధరి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 07:26 PM
142 వీక్షణలు

విశాఖపట్నంలో ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన కిరాణా హోల్‌సేల్ దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, వాటర్ ప్లాంట్లపై జాయింట్ కలెక్టర్ విద్యాధరి కఠిన చర్యలు తీసుకున్నారు. వివిధ ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం రూ.6.5 లక్షల జరిమానా విధించడంతో పాటు, మరో వాటర్ ప్లాంట్ లైసెన్స్‌ను రద్దు చేశారు.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ 2006 చట్టం ప్రకారం విశాఖలోని 12 సంస్థలపై ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నాణ్యత లేని ధాన్యాలు, పప్పులు, ఆహార పదార్థాల విక్రయం, కృత్రిమ రంగుల వినియోగం, చికెన్ లాలిపాప్, ఫ్రైల్లో నాసిరకం పదార్థాల వాడకం, గడువు ముగిసిన పానీయాలు, పాడైన ఆహార పదార్థాల విక్రయం వంటి అంశాలపై జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇకపై ఇలాంటి ఉల్లంఘనలు పునరావృతమైతే లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కల్యాణ చక్రవర్తి, ఆహార భద్రతాధికారి జీవీ అప్పారావు నమోదు చేసిన కేసులను శుక్రవారం సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.