BREAKING
వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం
Date of Publish : 10 September 2026, 08:01 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ బుకీల అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Sep, 2026 - 08:01 AM
7 వీక్షణలు

ప్రొద్దుటూరు: ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రొద్దుటూరు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డి.99.యాప్ ద్వారా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి హుస్సేన్, సురేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రొద్దుటూరు ఒకటో పట్టణ ఎస్సై మొయినుద్దీన్ అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.20 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు ఒకటో పట్టణ సీఐ కొండారెడ్డి మాట్లాడుతూ ఆన్‌లైన్ బెట్టింగ్, మట్కా, జూదం తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత బెట్టింగ్‌లకు ఆకర్షితులై ఆర్థికంగా నష్టపోవడంతో పాటు కుటుంబ సమస్యలకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న వారు లేదా వాటికి సంబంధించిన సమాచారం తెలిసినట్లయితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సీఐ కొండారెడ్డి కోరారు.