పూర్తి వందేమాతరం ఆలాపనపై కాంగ్రెస్ అభ్యంతరం
జమ్మూకశ్మీర్‌లో సీఎం ఒమర్ అబ్దుల్లా కార్యక్రమంలో పూర్తి గీతం.. కూటమి పార్టీలకు కాంగ్రెస్ సూచన
శ్రీనగర్ | Ntoday News
‘వందేమాతరం’ గీతాన్ని పూర్తిగా ఆలపించడంపై కాంగ్రెస్ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో సీఎం ఒమర్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ (NC) అధినేత ఫరూక్ అబ్దుల్లా పాల్గొన్న ఓ కార్యక్రమంలో పూర్తి ‘వందేమాతరం’ గీతాన్ని ప్రదర్శించినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్ ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసి అభ్యంతరం వ్యక్తం చేశారు. కూటమిలోని పార్టీలన్నీ ‘వందేమాతరం’లో రెండు చరణాలను మాత్రమే ఆలపించాలని ఆయన కోరినట్లు సమాచారం.
అయితే కాంగ్రెస్ సూచనపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత బషీర్ స్పందిస్తూ.. ‘వందేమాతరం’ను ఎంతవరకు ఆలపించాలో తమకు కాంగ్రెస్ నిర్దేశించాల్సిన అవసరం లేదని కౌంటర్ ఇచ్చారు. ఈ అంశం కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది.