BREAKING
వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం పటాన్‌చెరులో గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ – హెల్త్ క్యాంపు కరవు పనులు చేస్తూ కూలీ మృతి పొదుపు సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందజేత. ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం
Date of Publish : 10 September 2026, 12:32 am
Posted by : DAVU RAVINDER REDDY

ఆయుష్ విద్యార్థుల స్టైపెండ్ భారీగా పెంపు

తెలంగాణ
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
10 Sep, 2026 - 12:32 AM
1 వీక్షణలు

రూ.13,754 నుంచి రూ.29,792కు హౌస్‌ సర్జన్ల స్టైపెండ్.. పీజీలకు రూ.74,482

హైదరాబాద్ | Ntoday News

తెలంగాణలో ఆయుర్వేద, హోమియోపతి, యునాని, నేచురోపతి (ఆయుష్) విభాగాల్లోని హౌస్‌ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైపెండ్లను భారీగా పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు (GO) జారీ చేసింది.

ఇప్పటివరకు హౌస్‌ సర్జన్లకు నెలకు రూ.13,754గా ఉన్న స్టైపెండ్‌ను రూ.29,792కు పెంచారు. అలాగే పీజీ విద్యార్థులకు నెలకు రూ.34,385 నుంచి రూ.74,482కు స్టైపెండ్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

స్టైపెండ్ పెంపుపై ఆయుష్ విద్యార్థులు, డాక్టర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రభుత్వ నిర్ణయం ఆయుష్ వైద్య విద్యార్థులకు ఆర్థికంగా మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని, తమ సేవలకు తగిన గుర్తింపు లభించిందని విద్యార్థులు, వైద్యులు పేర్కొన్నారు.