BREAKING
thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు
Date of Publish : 10 August 2026, 09:43 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆరేళ్ల తర్వాత మళ్లీ విద్యుత్ ఉత్పత్తి....

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Aug, 2026 - 09:43 AM
51 వీక్షణలు

ఆరేళ్ల తర్వాత మళ్లీ విద్యుత్ ఉత్పత్తి.. నేడు శ్రీశైలం నాలుగో యూనిట్‌లో ట్రయల్ రన్

శ్రీశైలం, ఆగస్టు 10: శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలోని నాలుగో యూనిట్‌లో సోమవారం ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ట్రయల్ రన్ విజయవంతమైతే యూనిట్‌ను విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం చేసి ఉత్పత్తిని ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. దీంతో సుమారు ఆరేళ్ల విరామం తర్వాత ఈ యూనిట్‌లో మళ్లీ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కానుంది.

2020 ఆగస్టులో బ్యాటరీల మార్పు సమయంలో సంభవించిన షార్ట్‌సర్క్యూట్ కారణంగా శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది ఉద్యోగులు మృతి చెందారు. ప్రమాదం అనంతరం నాలుగో యూనిట్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

తాజాగా యూనిట్ పునరుద్ధరణ పనులు పూర్తికావడంతో ట్రయల్ రన్‌కు అధికారులు సిద్ధమయ్యారు. ట్రయల్ రన్ సందర్భంగా యంత్రాల పనితీరు, భద్రతా ప్రమాణాలు, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అన్ని పరీక్షలు సంతృప్తికరంగా పూర్తయితే గ్రిడ్‌కు అనుసంధానం చేసి వాణిజ్యపరంగా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది.