BREAKING
thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు
Date of Publish : 24 September 2026, 04:56 pm
Posted by : భూబత్తుల చెన్నారావు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుఫాన్ పరిస్థితులపై మంత్రి తుమ్మల సమీక్ష

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
భూబత్తుల చెన్నారావు సత్తుపల్లి నియోజకవర్గం
24 Sep, 2026 - 04:56 PM
11 వీక్షణలు

ఖమ్మం, సెప్టెంబర్ 24: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుఫాన్ ప్రభావంతో నెలకొన్న వాతావరణ పరిస్థితులపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కలెక్టర్లతో చరవాణి ద్వారా మాట్లాడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

వాతావరణ పరిస్థితులు రానున్న రోజుల్లో మరింత ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా వినాయక నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నందున భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.

వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. నిమజ్జన ప్రాంతాల్లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఆయా గ్రామాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే స్పందించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి తుమ్మల సూచించారు. ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని కోరారు.

ప్రస్తుతం వాతావరణ శాఖ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం సహా తెలంగాణలోని పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది.