BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 27 May 2026, 06:27 pm
Posted by : V శ్రీనివాస్

​ఆటో డ్రైవర్ల సంక్షేమానికి సత్తయ్య చేసిన సేవలు మరవలేనివి: నగర కాంగ్రెస్ అధ్యక్షులు తూముల నరేష్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
27 May, 2026 - 06:27 PM
166 వీక్షణలు

​మంచిర్యాల: ఇటీవల గుండెపోటుతో ఆకస్మికంగా మరణించిన మంచిర్యాల పట్టణ ఆటో రిక్షా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కీ.శే. అంకతి సత్తయ్య గారి సేవలు ఎనలేనివని మంచిర్యాల నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్ కొనియాడారు. మంచిర్యాలలో నిర్వహించిన సత్తయ్య గారి పెద్ద కర్మ కార్యక్రమంలో ఆయన పాల్గొని, సత్తయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

​అనంతరం శోకసప్తప్త కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన గాఢ సానుభూతిని తెలియజేశారు. సత్తయ్య అకాల మరణం ఆటో కార్మిక రంగానికి తీరని లోటని, ఆయన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ఆటో అసోసియేషన్ ప్రతినిధులు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు