BREAKING
thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు
Date of Publish : 11 July 2026, 08:02 pm
Posted by : కూనురు మధు

​జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా పోకల దేవదాసు నియామకం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
11 Jul, 2026 - 08:02 PM
150 వీక్షణలు

​నల్గొండ జిల్లా చిట్యాల పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పోకల దేవదాసు జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయనకు నియామక పత్రాన్ని జారీ చేశారు. ​ఈ సందర్భంగా పోకల దేవదాసు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి తాను అందిస్తున్న సేవలను గుర్తించి, ఈ బాధ్యతను అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పార్టీ బలోపేతానికి మరియు అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర రోడ్డు, భవనాల మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, నకిరేకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు, మరియు నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేతకు దేవదాసు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ​ఈ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ చిట్యాల మున్సిపల్ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పోకల దేవదాసును శాలువాతో ఘనంగా సన్మానించారు.  ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పందిరి గీతా రమేష్, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు, కౌన్సిలర్లు బొబ్బలి సందీపా రాంరెడ్డి, కో ఆప్షన్ సభ్యులు బెల్లి సత్తయ్య, ఎస్.కె ఇబ్రహీం, , ఇమ్రాన్ , కనకదుర్గ ఆలయ చైర్మన్ మారగోని ఆంజనేయులు, , కాంగ్రెస్ నాయకులు చిట్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్న మల్లయ్య,, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఎద్దులపురి కృష్ణ, మాజీ కౌన్సిలర్ సిలివేరు శేఖర్, దిశపాక రాజేష్, జిట్ట శేఖర్ , తదితరులు పాల్గొన్నారు..