BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 11 July 2026, 08:14 pm
Posted by : కూనురు మధు

విద్యుత్ షాక్ తో రైతు మృతి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
11 Jul, 2026 - 08:14 PM
534 వీక్షణలు

వ్యవసాయ బావి వద్ద పైపు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఓ రైతు మృతి చెందిన విషాద సంఘటన రామన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది.​ఎస్ఐ జి. సతీష్ తెలిపిన వివరాల ప్రకారం కుంకుడుపాముల గ్రామానికి చెందిన గొలుసుల వెంకన్న (38) వృత్తిరీత్యా వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. అతనికి గ్రామ శివారులో వ్యవసాయ భూమి ఉంది. ఎప్పటిలాగే శనివారం ఉదయం 6 గంటల సమయంలో వెంకన్న తన పొలానికి వెళ్లాడు. అక్కడ బోరు మోటారుకు ఊడిపోయిన పైపును అమర్చే క్రమంలో, ప్రమాదవశాత్తు మోటారుకు ఉన్న విద్యుత్ వైరు తగిలింది.

​దీంతో ఒక్కసారిగా కరెంట్ షాక్‌కు గురైన వెంకన్న గట్టిగా అరుస్తూ కిందపడిపోయి అక్కడికక్కడే ప్రాణాలు  కోల్పోయాడని మృతుడి భార్య గొలుసుల శైలజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు   కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సతీష్ పేర్కొన్నారు. యువ రైతు మృతితో కుంకుడుపాముల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.