BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలి: మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
11 Jul, 2026 - 08:01 PM
93 వీక్షణలు

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 52వ డివిజన్‌లో మంచిర్యాల క్లబ్ ఆధ్వర్యంలో, రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు విచ్చేసి శిబిరాన్ని పరిశీలించారు. అనంతరం రక్తదానం చేసిన దాతలకు ఆయన చేతుల మీదుగా రక్తదాన ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో రక్తదానం చేయడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని, ఇంతటి ఉన్నతమైన సామాజిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన క్లబ్ కమిటీ సభ్యులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అలాగే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

​ఈ రక్తదాన శిబిరంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, స్థానిక కార్పొరేటర్ సాయినీ స్రవంతి - కిషోర్, క్లబ్ అధ్యక్షులు వెంకట రమణారావు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, కోశాధికారి నర్సింగరావు పాల్గొన్నారు. వీరితో పాటు క్లబ్ ఉపాధ్యక్షులు జితేందర్ రావు, కొత్త రాజేశం, శశిపాల్ రెడ్డి, కార్యదర్శులు వడ్డే రాజమౌళి, జుర్రు నగేష్, కల్వల జగన్ మోహన్ రావు, నల్ల శ్రీనివాస్, క్రీడా కార్యదర్శి సత్యపాల్ రెడ్డి, మరియు పలువురు ముఖ్య నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు