BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 11 July 2026, 08:02 pm
Posted by : V శ్రీనివాస్

​'SIR' ప్రక్రియలో మంచిర్యాల రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవాలి: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
11 Jul, 2026 - 08:02 PM
154 వీక్షణలు

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీ రోడ్డులో గల మినీ పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో 'SIR' ప్రక్రియపై కార్పొరేటర్లు, ముఖ్య కార్యకర్తలతో మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ గారి ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న SIR ప్రక్రియ కార్యక్రమంలో మంచిర్యాల నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. ఇందుకోసం ఈనెల 24వ తేదీ వరకు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అందరూ క్షేత్రస్థాయిలో ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ, కలిసికట్టుగా శ్రమించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.

​ఈ సమావేశంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు తూముల నరేష్, పిసిసి సభ్యులు కొండ శేఖర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గజ్జల హేమలత పాల్గొన్నారు. వీరితో పాటు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు, మహిళా ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు