BREAKING
thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు
Date of Publish : 22 June 2026, 10:03 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని కాపాడిన మార్కాపురం పోలీసులు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 10:03 PM
117 వీక్షణలు

మార్కాపురం జిల్లా: కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న సమయంలో సకాలంలో స్పందించిన మార్కాపురం జిల్లా పోలీసులు అతని ప్రాణాలను కాపాడారు.

మార్కాపురం పట్టణానికి చెందిన బండి రామదాసు (35) సోమవారం సాయంత్రం తాను చనిపోతున్నానంటూ కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాడు. విషయం తెలుసుకున్న అతని స్నేహితుడు అద్దంకి మాధవ డయల్-112కు సమాచారం అందించాడు.

సమాచారం అందుకున్న వెంటనే మార్కాపురం డీఎస్పీ యు. నాగరాజు, సీఐ అల్తాఫ్ హుస్సేన్ ఆదేశాల మేరకు ఎస్సై వి. వేమన, సిబ్బంది ఐటీ కోర్ టీం సహాయంతో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి రామదాసు ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు.

రైల్వే ట్రాక్ సమీపానికి చేరుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అతడిని రక్షించారు. అనంతరం కౌన్సిలింగ్ నిర్వహించి మానసికంగా ధైర్యం చెప్పి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

సకాలంలో స్పందించి ప్రాణాలను కాపాడిన పోలీసు అధికారులకు, సిబ్బందికి రామదాసు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.