BREAKING
ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు
Date of Publish : 22 March 2026, 02:32 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడొద్దు.. మహిళా సంఘాల భవనాలపై మంత్రి అడ్లూరి కీలక ఆదేశాలు!

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
22 Mar, 2026 - 02:32 PM
142 వీక్షణలు

బుగ్గారం: ప్రభుత్వ భవనాల నిర్మాణంలో మరియు ఇతర అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం బుగ్గారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ఘనంగా శంకుస్థాపన చేశారు.

​రూ. 65 లక్షల అభివృద్ధి పనులకు శ్రీకారం:

బుగ్గారంలో రూ. 25 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డుకు, రూ. 10 లక్షలతో నిర్మించే మహిళా సంఘాల వీవో భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే వెల్గొండ గ్రామంలో రూ. 5 లక్షలతో డ్రైనేజీ పనులు, రూ. 15 లక్షలతో అదనపు తరగతి గదుల నిర్మాణం, రూ. 10 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.

​అధికారులపై బాధ్యత:

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల అవసరాల కోసం నిర్మించే ప్రతి పనిలో నాణ్యత ఉండాలని, కాంట్రాక్టర్ల ద్వారా నాణ్యమైన పనులు చేయించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. నాణ్యతకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.

​మహిళా సంఘాలకు పెద్దపీట:

నియోజకవర్గంలో మహిళా సంఘాల కోసం నిర్మించే వీవో భవనాలను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని త్వరగా పూర్తి చేయాలని మంత్రి తెలిపారు. ఈ భవనాల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కోసం అదనపు నిధులు కేటాయించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు.

​ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.