BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​అద్దెదారులు, పనిమనుషుల వివరాలపై నిఘా ఉంచండి: మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
24 May, 2026 - 12:22 PM
110 వీక్షణలు

​అద్దెదారుల పూర్తి వివరాల సేకరణ తప్పనిసరి

​మంచిర్యాల: జిల్లాలో నేరాల నియంత్రణ, భద్రత పెంపొందించడమే లక్ష్యంగా ఇళ్లను అద్దెకు ఇచ్చే యజమానులకు మంచిర్యాల జిల్లా పోలీసు అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ మాట్లాడుతూ, ఇళ్ల యజమానులు తమ ఇళ్లను అద్దెకు ఇచ్చే ముందే అద్దెదారుల పూర్తి చిరునామా, వారు పనిచేసే స్థలం వంటి వివరాలను తప్పనిసరిగా తెలుసుకోవాలని మరియు వారి కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుండి కొత్తగా వచ్చే వ్యక్తుల వివరాలను స్థానిక పోలీసులకు తెలియజేయడం అత్యవసరమని, ఈ నిబంధనలను పాటించడం ద్వారా సమాజంలో అనుమానాస్పద కార్యకలాపాలను అరికట్టడానికి పోలీసులకు ప్రజలు సహకరించవచ్చని ఆయన స్పష్టం చేశారు.

​పనిమనుషుల నేపథ్యంపై క్షుణ్ణంగా పరిశీలించాలి:

​ ఇంటి పనులు లేదా పిల్లల సంరక్షణ కోసం కొత్తగా వ్యక్తులను నియమించుకునేటప్పుడు యజమానులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు కోరారు. అపరిచిత వ్యక్తులను గుడ్డిగా నమ్మకుండా, వారిని పనిలో పెట్టుకునే ముందే వారి నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించవలసిన అవసరం ఉందని డీసీపీ నొక్కి చెప్పారు. అద్దె ఇళ్ల భద్రతను మెరుగుపరచడంతో పాటు, సమాజంలో శాంతిభద్రతలను కాపాడటంలో ఇళ్ల యజమానుల పాత్ర కీలకమని, ప్రతి ఒక్కరూ ఈ భద్రతా సూచనలను పాటించి పోలీసు యంత్రాంగానికి అండగా నిలవాలని అధికారులు పిలుపునిచ్చారు