BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 14 May 2026, 06:24 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

అడుగంటుతున్న శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు..!!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 May, 2026 - 06:24 PM
164 వీక్షణలు

అడుగంటుతున్న శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు..!!

తెలుగు రాష్ట్రాలకు సాగు, తాగునీటి ప్రధాన ఆధారాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. వర్షాభావ పరిస్థితులు, ఎండల తీవ్రతతో జలాశయాల్లో నీటి మట్టాలు రోజురోజుకూ తగ్గుతున్నాయి.

శ్రీశైలం ప్రాజెక్టులో గరిష్ఠ నీటి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం 39.2 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. డెడ్ స్టోరేజీ స్థాయి 810 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 817.7 అడుగుల వద్ద నమోదైంది.

అటు నాగార్జునసాగర్ ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుతం 157.42 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. డెడ్ స్టోరేజీ 510 అడుగులు కాగా నీటి మట్టం 524 అడుగులకు చేరింది.

ఇక పులిచింతల ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 32.42 టీఎంసీల నీటి నిల్వలు నమోదయ్యాయి.

వర్షాలు ఆలస్యమైతే సాగు, తాగునీటి అవసరాలపై ప్రభావం పడే అవకాశముందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.