BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 29 June 2026, 06:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాష్ట్ర భవిష్యత్తు కోసం సీఎం కృషి..

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jun, 2026 - 06:15 PM
148 వీక్షణలు

దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్‌, భారతీ ఎంటర్‌ప్రైజెస్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్‌ను రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు.

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ మౌలిక సదుపాయాల బలోపేతం, ప్రజలకు మెరుగైన కనెక్టివిటీ, లాస్ట్-మైల్ ఇంటర్నెట్ సేవల విస్తరణ, మొబైల్ టవర్ కనెక్టివిటీ పెంపు, డేటా సెంటర్ల ఏర్పాటు, సముద్రగర్భ ఇంటర్నెట్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌లో పెట్టుబడులు, అలాగే మొబైల్ సర్వీస్ ఆపరేటర్లకు వ్యాపార సౌలభ్యాన్ని మరింత మెరుగుపరచడం వంటి కీలక అంశాలపై దాదాపు మూడు గంటలపాటు విస్తృతంగా చర్చించారు.

సమావేశం ముగిసిన తర్వాత కేవలం మర్యాదపూర్వకంగా వీడ్కోలు చెప్పడం కాకుండా, స్వయంగా గేటు వరకు వెళ్లి, కారు ఎక్కే వరకు దగ్గర ఉండి సునీల్ భారతీ మిట్టల్‌కు వీడ్కోలు పలికిన ముఖ్యమంత్రి వ్యవహారశైలి ప్రత్యేకంగా నిలిచింది.

ఆదివారం, సెలవు దినం అనే తేడా లేకుండా రోజుకు 16 గంటలపాటు పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న నాయకత్వానికి ఇది మరో ఉదాహరణగా పలువురు పేర్కొంటున్నారు.

ఇది వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదు… రాష్ట్ర భవిష్యత్తు కోసం చేస్తున్న కృషి.