BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

లోపూడి గ్రామంలో ఏరువాక కార్యక్రమం నిర్వహించిన మంత్రి కొలుసు పార్థసారథి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jun, 2026 - 04:58 PM
77 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం లోపూడి గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి భూమాతకు పూజలు నిర్వహించి ఖరీఫ్ సీజన్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎడ్లు, నాగలి, గునపం తదితర వ్యవసాయ పనిముట్లకు పూజలు చేసి, నాగలితో దుక్కి దున్ని రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఏరువాక పౌర్ణమి ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి అత్యంత పవిత్రమైన వ్యవసాయ పండుగ అని పేర్కొన్నారు.

రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన వరి, పత్తి, మిర్చి, పప్పుధాన్యాల విత్తనాలను 80 శాతం రాయితీపై అందిస్తున్నామని చెప్పారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు నిధులు విడుదల చేసినట్లు వెల్లడించారు.

ఖరీఫ్-2026 ఉచిత పంట బీమా నమోదు ప్రక్రియ ప్రారంభమైందని, ప్రతి రైతు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించాలని రైతులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ బి. వినూత్న, తెలుగుదేశం మండల అధ్యక్షుడు జి. రఘు, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, రైతులు పాల్గొన్నారు.