BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 13 January 2026, 05:52 am
Posted by : NTODAY NEWS OFFICIAL

10వ తరగతి విద్యార్థులకు దత్తత కార్యక్రమం

తెలంగాణ
13 Jan, 2026 - 05:52 AM
237 వీక్షణలు

కొండమడుగు గ్రామంలో 10వ తరగతి విద్యార్థులకు దత్తత కార్యక్రమం ప్రారంభం

విద్యార్థుల భవిష్యత్తుకు తోడ్పాటే లక్ష్యం NTODAY NEWS:  బీబీనగర్ ప్రతినిధి: బాల్ద. భాస్కర్ కురుమ యాదాద్రి భువనగిరి జిల్లా, బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం దత్తత కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులను అదే గ్రామానికి చెందిన యువత, విద్యావంతులు స్వచ్ఛందంగా దత్తత తీసుకుని, ఇప్పటి నుంచి వార్షిక పరీక్షలు వచ్చే వరకు వారి చదువుకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేస్తూ, విద్యార్థులు పదో తరగతి ఉత్తీర్ణులు అయ్యేలా బాధ్యత తీసుకోవడం అభినందనీయమైన చర్య అని తెలిపారు. అలాగే 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పిల్లలకు చదువుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. ఇంట్లో టీవీలను ఆపి, చదువుపై దృష్టి పెట్టేలా సహకరించాలని అన్నారు. విద్యార్థులు ఆటలు, పాటలను పక్కన పెట్టి ప్రతిరోజూ ఉదయం 4 గంటలకు లేచి శ్రద్ధగా చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. 10వ తరగతి విద్య జీవితంలో అత్యంత కీలక దశ అని, ఇక్కడ ఉత్తీర్ణత సాధిస్తేనే ఉన్నత చదువులకు మార్గం సుగమమవుతుందని, జీవితంలో స్థిరపడాలంటే పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి అని తెలిపారు. #StudentAdoptionProgram #EducationForAll #Class10Students #YadadriBhuvanagiri #BBNagar #RuralEducation #DistrictAdministration #NtodayNews Follow us on Website Facebook Instagram YouTube