BREAKING
30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! 30 ఏళ్ల కల సాకారం.. వెలిగొండ ప్రాజెక్ట్‌కు జాతికి అంకితం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీవై పార్టీ పోటీ.. ఎల్కతుర్తి: 22-ఏ జీవోపై బీజేపీ మహాధర్నా వెయ్యి రోజుల పాలనపై కాంగ్రెస్ vs BRS ఎల్కతుర్తి మండలంలోని పలు గ్రామాలకు క్రాసింగ్ లేక హైవే తిప్పలు నేడు మార్కాపురం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు.. మేడికొండూరు: ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా ప్రమాదం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు!
Date of Publish : 02 June 2026, 10:02 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఏపీ ఖజానాకు కాసుల వర్షం రికార్డు స్థాయిలో GST వసూళ్లు!

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
02 Jun, 2026 - 10:02 PM
103 వీక్షణలు

ఏపీ ఖజానాకు కాసుల వర్షం రికార్డు స్థాయిలో GST వసూళ్లు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా మళ్లీ కళకళలాడుతోంది. రాష్ట్ర ఆదాయం రికార్డు స్థాయిలో దూసుకెళ్తోంది. 2026 మే నెలలో రాష్ట్ర పన్నుల వసూళ్లు భారీగా పెరిగాయి. ఏకంగా 19 శాతం వృద్ధితో రూ.4,950 కోట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే నెలలో రూ.4,165 కోట్లు వసూలు కాగా, ఈసారి అదనంగా రూ.737 కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం, పన్నుల చెల్లింపుల్లో పారదర్శకత పెరగడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ అంశంపై ది హిందూ పత్రిక ప్రత్యేక కథనం రాసుకొచ్చింది. ఈ కథనాన్ని మంత్రి నారా లోకేష్‌ ఎక్స్‌ వేదికగా షేర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఆన్ ఫైర్ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు. వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ బాబు ఏ. సోమవారం విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం..GST వసూళ్లు 16 శాతం వృద్ధితో రూ.3,037 కోట్లకు చేరుకున్నాయి. 2025 మే నెలలో ఇవి రూ.2,629 కోట్లుగా ఉన్నాయి. అలాగే, IGST సెటిల్మెంట్ ద్వారా రాష్ట్రానికి రూ.1,758.58 కోట్లు వచ్చాయి (గతేడాదితో పోలిస్తే 15.36% వృద్ధి). ఇక పెట్రోలియం ఉత్పత్తుల వ్యాట్ ఏకంగా 31.79 శాతం పెరిగి రూ.1,768.82 కోట్లకు చేరడం విశేషం. Professional Tax ద్వారా రూ.48.92 కోట్లు, మద్యం వ్యాట్ ద్వారా రూ.89 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరాయి.

GST వసూళ్లలో ఆంధ్రప్రదేశ్ జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక (17%) తర్వాతి స్థానంలో నిలిచి రెండో ప్లేస్ కైవసం చేసుకుంది. కేరళ (15%), తెలంగాణ (14%), తమిళనాడు (12%) రాష్ట్రాలు ఏపీ తర్వాతి స్థానాల్లోనే ఆగిపోయాయి. పెట్రోలియం, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఎలక్ట్రికల్ మెషినరీ, బులియన్, జ్యువెలరీ రంగాల్లో లావాదేవీలు పెరగడమే ఈ రికార్డు వసూళ్లకు కారణమని అధికారులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు పన్ను ఎగవేతలు, నకిలీ ఇన్వాయిస్‌లను అరికట్టేందుకు వాణిజ్య పన్నుల శాఖ టెక్నాలజీకి పెద్దపీట వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతను వాడటం, వివిధ శాఖల డేటాను అనుసంధానం చేయడం ద్వారా పన్నుల లీకేజీని అరికట్టగలిగారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ డిజిటల్ వ్యవస్థలను, ఆటోమేటెడ్ మానిటరింగ్ విధానాలను మరింత బలోపేతం చేయాలని వాణిజ్య పన్నుల శాఖ యోచిస్తోంది.