BREAKING
సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు
www.ntodaynews.com

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 33,012 ఎకరాలకు ఫ్రీహోల్డ్ జారీ

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
30 Apr, 2026 - 02:52 PM
151 వీక్షణలు

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 33,012 ఎకరాలకు ఫ్రీహోల్డ్ జారీ

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం భూసంబంధిత వ్యవహారాల్లో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గ్రామ సర్వీసు ఇనాం భూములను ఫ్రీహోల్డ్ చేసిన ప్రభుత్వం, తాజాగా షరతులతో ఉన్న (కండీషనల్) పట్టా భూములకూ అదే సడలింపు ఇచ్చింది.

రాష్ట్రంలోని 15 జిల్లాల పరిధిలో మొత్తం 33,440.62 ఎకరాల కండీషనల్ పట్టా భూములు ఉండగా, వాటిలో 33,012.35 ఎకరాలను ఫ్రీహోల్డ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నిర్ణయంతో ఇప్పటివరకు షరతులతో పరిమితమైన భూములపై యజమానులకు పూర్తి హక్కులు లభించనున్నాయి. ముఖ్యంగా, ఈ భూములను ఇకపై స్వేచ్ఛగా విక్రయించుకునే అవకాశం కలగడం రైతులు, భూస్వాములకు పెద్ద ఊరటగా మారనుంది.

భూవ్యవస్థలో పారదర్శకత పెంచడం, భూస్వాముల హక్కులను బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.