BREAKING
thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన
Date of Publish : 28 May 2026, 01:28 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

ఏపీలో బగ్గుమంటున్న ఎండలు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
28 May, 2026 - 01:28 PM
158 వీక్షణలు

ఏపీ లోని పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పుల హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు రోజు రోజుకు తీవ్రరూపం దాలుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నేడు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలోని 119 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 155 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లే ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు అవసరం లేకపోతే మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లే వారు తగినంత నీరు తాగడం, తలపై గుడ్డ లేదా టోపీ ధరించడం, శరీరాన్ని చల్లగా ఉంచే ఆహార పదార్థాలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

వ్యవసాయ కూలీలు, నిర్మాణ కార్మికులు, బయట పని చేసే వారు ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆసుపత్రికి వెళ్లాలని వైద్య శాఖ సూచించింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు పాటించాలని ప్రభుత్వం కోరుతోంది.