BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 20 August 2026, 07:29 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో మిలాద్‌-ఉన్‌-నబీ సెలవు తేదీ మార్పు.. ఆగస్టు 26న సాధారణ సెలవు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Aug, 2026 - 07:29 PM
75 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిలాద్‌-ఉన్‌-నబీ పండుగ సాధారణ సెలవు తేదీలో మార్పు చేసింది. గతంలో ప్రకటించిన ఆగస్టు 25, 2026 (మంగళవారం) సెలవును మార్చి, ఆగస్టు 26, 2026 (బుధవారం)ను సాధారణ సెలవు దినంగా ఖరారు చేసింది.

చంద్రదర్శనం ఆధారంగా ఇస్లామిక్ క్యాలెండర్‌లోని రబీ ఉల్ అవ్వల్ నెల తేదీలో మార్పు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓ విజ్ఞప్తి మేరకు సెలవు తేదీని సవరించారు.

ఇప్పటికే 2025 డిసెంబర్ 4న జారీ చేసిన జీఓ ఆర్.టి. నెం.2276కు సవరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 12వ రబీ ఉల్ అవ్వల్ (మిలాద్‌-ఉన్‌-నబీ) ఆగస్టు 26న రావడంతో ఆ రోజును ప్రభుత్వ కార్యాలయాలకు సాధారణ సెలవుగా ప్రకటించారు.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (పొలిటికల్) జె. శ్యామల రావు ఉత్తర్వులు జారీ చేశారు.

పాత సెలవు తేదీ: ఆగస్టు 25, 2026 (మంగళవారం)

కొత్త సెలవు తేదీ: ఆగస్టు 26, 2026 (బుధవారం)