BREAKING
thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
Date of Publish : 28 August 2026, 03:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చిలకలూరిపేటలో హైటెన్షన్‌.. మృతుల కుటుంబాల ఆందోళన బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారం అందలేదని నిరసన

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 03:51 PM
87 వీక్షణలు

చిలకలూరిపేటలో నిన్న రాత్రి జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆటోలో ప్రయాణిస్తున్న వారిని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం అందలేదని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. టీడీపీ ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు స్వయంగా తమ వద్దకు వచ్చి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే తమ వద్దకు రాకపోతే మృతదేహాలతో ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు.

మృతుల కుటుంబాల ఆందోళన నేపథ్యంలో చిలకలూరిపేట ఎన్‌ఆర్‌టీ సెంటర్‌లో పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.