BREAKING
thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి
Date of Publish : 15 May 2026, 03:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో మరో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌.. విజయవాడ-గుంటూరు మధ్య భారీ ప్రాజెక్ట్‌!

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 May, 2026 - 03:28 PM
128 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో మరో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. విజయవాడ-గుంటూరు నగరాల మధ్య ప్రాంతంలో అత్యాధునిక సదుపాయాలతో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.

తాడికొండ మండలం రావెల సమీపంలో ఈ భారీ ప్రాజెక్ట్‌కు అనువైన స్థలాన్ని అధికారులు ఇప్పటికే గుర్తించారు. మొత్తం 4,618 ఎకరాల్లో విమానాశ్రయం అభివృద్ధి చేయాలని భావిస్తుండగా, తొలి దశలో 2,648 ఎకరాల్లో నిర్మాణ పనులు చేపట్టే అవకాశముంది.

ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా గ్రామాల్ని తరలించాల్సిన పరిస్థితి రాకుండా స్థల ఎంపికలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. భూసమీకరణ, భూసేకరణ ప్రక్రియలపై ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఈ ప్రాజెక్ట్ తొలి దశ నిర్మాణానికి సుమారు రూ.3,409 కోట్ల పెట్టుబడి అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 4 వేల మీటర్ల పొడవు, 60 మీటర్ల వెడల్పుతో భారీ రన్‌వే నిర్మించనున్నారు.

ఈ ఎయిర్‌పోర్ట్‌ పూర్తయితే విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రాంతాలకు గ్లోబల్ కనెక్టివిటీ పెరగడంతో పాటు పెట్టుబడులు, ఐటీ, పారిశ్రామిక రంగాలకు భారీ ఊతం లభించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.