BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 11 July 2026, 05:58 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో రూర్బన్ పంచాయతీ ఉద్యోగులకు శుభవార్త

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jul, 2026 - 05:58 AM
105 వీక్షణలు

అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాల తరహా సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'రూర్బన్' విధానాన్ని అమలు చేస్తోంది. 10 వేల మందికిపైగా జనాభా ఉన్న లేదా వార్షికంగా రూ.1 కోటికి పైగా ఆదాయం ఉన్న గ్రామ పంచాయతీలను రూర్బన్ పంచాయతీలుగా ఎంపిక చేసింది.

ఈ నేపథ్యంలో రూర్బన్ పంచాయతీల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. జూనియర్ అసిస్టెంట్ పోస్టులను సీనియర్ అసిస్టెంట్ హోదాకు అప్‌గ్రేడ్ చేసి, వాటికి అనుగుణంగా పే స్కేల్‌ను సవరించింది. అలాగే డిప్యూటీ ఎంపీడీవోలు, సీనియర్ పంచాయతీ కార్యదర్శులకు పాలనాధికారులుగా గెజిటెడ్ హోదా కల్పించింది.

రాష్ట్రవ్యాప్తంగా 359 రూర్బన్ గ్రామ పంచాయతీలను ప్రభుత్వం గుర్తించింది. ఈ నిర్ణయంతో పంచాయతీ పరిపాలన మరింత బలోపేతం కావడంతో పాటు ఉద్యోగులకు పదోన్నతులు, మెరుగైన వేతన ప్రయోజనాలు లభించనున్నాయి.