BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 11 July 2026, 05:58 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కృష్ణా జలాశయాలపై ఖరీఫ్ ఆశలు.. ఎగువ వర్షాలకే ఎదురుచూపు

భక్తి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jul, 2026 - 05:58 AM
132 వీక్షణలు

తెలుగు రాష్ట్రాల సాగు, తాగునీటి అవసరాలకు కీలకమైన కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో ఎట్టకేలకు వరద ప్రవాహం మొదలైంది. ఎల్‌నినో ప్రభావంతో జూన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 40 రోజులు గడిచినా ప్రధాన జలాశయాలు నీరసంగా కనిపించాయి. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.

ఇటీవల మహారాష్ట్ర, కర్ణాటక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు పరిస్థితిని కొంతమేర మార్చుతున్నాయి. అల్మట్టి జలాశయానికి వరద నీరు చేరుతుండటంతో, అదే ప్రవాహం కొనసాగితే జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు కూడా నీటి రాక పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

జూన్ నెల నిరాశపరిచినప్పటికీ, జూలై–ఆగస్టులో విస్తారంగా వర్షాలు కురిస్తేనే కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు నిండడంతో పాటు ఖరీఫ్ సాగుకు అవసరమైన నీటి లభ్యత మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కర్ణాటక జలాశయాల్లోకి వస్తున్న వరదలపైనే తెలుగు రాష్ట్రాల రైతుల ఆశలు నిలిచాయి.