BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం? thumb ● సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: ఏఐఎస్ఎఫ్ thumb ● సంగారెడ్డి జిల్లాలో ఉద్యోగావకాశాలు.. thumb ● సిమెంట్ లారీ ప్రమాదంలో యువకుడు మృతి.. బుజునూరులో గ్రామస్తుల నిరసన thumb ● డాక్టర్ హిమశేఖర్ స్కూల్లో విజయదశమి ఉత్సవాలు thumb ● గుంటూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు మార్గం సుగమం? thumb ● తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రో.. వి బాలకృష్ణారెడ్డిని కలిసిన రమేష్ thumb ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్‌కు సన్మానం thumb ● జీరో పావర్టీ మిషన్‌పై మండల స్థాయి శిక్షణ thumb ● ఎన్నికల నేపథ్యంలో చిత్తూరులో పోలీసుల విస్తృత తనిఖీలు thumb ● తామరాజుపల్లి కొండల్లో పులి సంచారం?
Date of Publish : 11 July 2026, 05:58 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

కరూర్ తొక్కిసలాటపై సీఎం విజయ్ సంచలన వ్యాఖ్యలు

భక్తి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jul, 2026 - 05:58 AM
145 వీక్షణలు

కరూర్, జులై 11: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కరూర్‌లో పర్యటించి, తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. అనంతరం మాట్లాడిన ఆయన, కరూర్ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని చెప్పారు.

ఈ ఘటనను డీఎంకే రాజకీయంగా ఉపయోగించుకుందని ఆరోపించిన విజయ్, తొక్కిసలాటకు తననే బాధ్యుడిగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందన్నారు. తనకు ప్రజలే ముఖ్యమని, డబ్బు కాదని స్పష్టం చేశారు. ప్రజల కోసమే తాను కరూర్‌కు వచ్చానని పేర్కొన్నారు.

ఘటన జరిగిన రోజు పోలీసుల పాత్రపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. "కరూర్ పోలీసులను నేను నమ్మాను. కానీ నన్ను నమ్మిన అమాయక ప్రజలను కోల్పోయాను. నన్ను కరూర్‌లోకి రానీయకుండా అడ్డుకునే అవకాశం పోలీసులకు ఉంది. అవసరమైతే సభను రద్దు చేసే అధికారం కూడా వారికి ఉంది. అయినా అలా చేయలేదు. అసలు ఈ ఘటనకు నిజమైన బాధ్యులు ఎవరు?" అని ప్రశ్నించారు.

ఘటన తర్వాత తాను తీవ్ర వేదనలో ఉన్నప్పటికీ రాజకీయ విమర్శలు ఎదుర్కొన్నానని విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. బందోబస్తుకు తగినంత మంది పోలీసులను నియమించకపోయినా, తనపైనే నిందలు మోపారని అన్నారు. ముఖ్యమంత్రి ఎమ్.కే. స్టాలిన్ అసెంబ్లీలో కూడా ఈ ఘటనపై రాజకీయాలు చేశారని ఆరోపించారు.

డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు ఎన్నేళ్లుగా తమిళనాడును దోచుకున్నాయని విమర్శించిన విజయ్, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలకు పూర్తిగా అడ్డుకట్ట వేస్తామని హామీ ఇచ్చారు.