BREAKING
thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● మూలపేట మండల పరిషత్ పాఠశాలలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నిక thumb ● పటాన్‌చెరులో మహిళ మృతదేహం కలకలం thumb ● మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో స్కూల్ కమిటీ ఎన్నికలు thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం టెండర్లపై ఆరోపణలు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి
Date of Publish : 11 August 2026, 09:08 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌పై కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్
/ విశాఖపట్నం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Aug, 2026 - 09:08 PM
89 వీక్షణలు

ఏపీలో సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌పై కేసు నమోదు

బావమరిది కోసం యువతిని బెదిరించారన్న ఆరోపణలు.. విశాఖలో 12 మందిపై ఎఫ్‌ఐఆర్‌

విశాఖపట్నం: ప్రముఖ గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌పై విశాఖపట్నంలో పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాహుల్‌ సిప్లిగంజ్‌తో పాటు మరో 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. బెదిరింపులు, సైబర్‌ వేధింపులు తదితర ఆరోపణలతో ఈ కేసు నమోదైనట్లు సమాచారం.

ఫిర్యాదులో యువతి చేసిన ఆరోపణల ప్రకారం.. కర్పూరపు రాహుల్‌ రెడ్డి తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని పేర్కొంది. అనంతరం తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను ఉపయోగించి బ్లాక్‌మెయిల్‌ చేసినట్లు ఆరోపించింది. ఈ వ్యవహారం తీవ్రరూపం దాల్చడంతో తాను ఇబ్బందులకు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ఈ వివాదంలో రాహుల్‌ సిప్లిగంజ్‌ జోక్యం చేసుకుని తనను బెదిరించారని కూడా యువతి ఆరోపించినట్లు సమాచారం. అంతేకాకుండా తనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా వీడియో ప్రకటనలు ఇప్పించారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

యువతి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు రాహుల్‌ సిప్లిగంజ్‌తో పాటు మరో 11 మందిపై వివిధ ఆరోపణల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు, ఫోన్‌ సంభాషణలు, ఫొటోలు, వీడియోలు తదితర అంశాలను పోలీసులు పరిశీలించే అవకాశం ఉంది.

కాగా, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు పూర్తయిన తర్వాత అసలు ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.