BREAKING
thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● గాంధీ, శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాళులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● గాంధీ, శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాళులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం
Date of Publish : 18 August 2026, 01:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధం.. ఏర్పాట్లు ముమ్మరం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Aug, 2026 - 01:17 PM
79 వీక్షణలు

ఎన్నికల నిర్వహణపై శాఖలకు స్పష్టమైన ఆదేశాలు.. న్యాయపరమైన అంశాలపై ప్రత్యేక దృష్టి

123 పట్టణ స్థానిక సంస్థలు.. 13,351 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియకు కసరత్తు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని పురపాలక, పంచాయతీరాజ్ శాఖలకు సూచనలు ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక పాలకవర్గాల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియపై అధికారులు దృష్టి సారించారు. 

ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుగానే అన్ని అంశాలను పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా కోర్టుల్లో ఉన్న కేసులు, న్యాయపరమైన వివాదాలు, ఇతర సాంకేతిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. 

ఎన్నికల సామగ్రి సమీకరణపై కూడా అధికారులు దృష్టి పెట్టారు. పోలింగ్‌కు అవసరమైన వస్తువులు, పరికరాల కొనుగోలుకు టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే సమయానికి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉండేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థలు, 13,351 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఇందులో గతంలో వివిధ కారణాలతో ఎన్నికలు జరగని ప్రాంతాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకమైన ఓటర్ల జాబితాలు, వార్డుల వివరాలు, రిజర్వేషన్లు, ఇతర పరిపాలనా అంశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. శాఖల మధ్య సమన్వయంతో పనిచేసి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 

గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కొత్త పాలకవర్గాల ఏర్పాటు నేపథ్యంలో రాజకీయ వాతావరణం కూడా వేడెక్కుతోంది. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.