BREAKING
స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్ స్టేషన్‌లోనే లంచం.. ఏసీబీ వలలో మహిళ ఎస్సై నందిత..! నూజివీడు కు గబ్బర్ సింగ్ రీ-ఎంట్రీ..! ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి మోరంపూడి శ్రీనివాసరావు నల్లమల అంచున పెద్దపులి సంచారం కలకలం అడవిలో లంకెబిందెల కలకలం.. గిద్దలూరు అటవీ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాలపై సంచలనం అమెరికాలో అంబరాన్నంటిన శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తె కుటుంబానికి గ్రామ బహిష్కరణ.. దళిత క్రైస్తవులు, ముస్లింలపై దాడులకు నిరసనగా విస్సన్నపేటలో వైసీపీ కొవ్వొత్తుల ర్యాలీ ​నార్కట్‌పల్లిలో గంజాయి డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల అకస్మిక తనిఖీలు హుజురాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బి కిషన్
www.ntodaynews.com

అక్కమహాదేవి జయంతి ఉత్సవం

భక్తి భక్తి
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
01 Apr, 2026 - 07:44 PM
73 వీక్షణలు

అక్కమహాదేవి జయంతి ఉత్సవం 

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 

 తేది:  01.04.2026

శ్రీశైల మల్లికార్జునస్వామి వారి పరమ భక్తులలో ఒకరైన శివశరణి అక్కమహాదేవి వారి జయంత్యోత్సవం   బుధవారం (01.04.2026) ఉదయం సంప్రదాయబద్దంగా నిర్వహించబడింది. 

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి వారికి పంచామృత అభిషేకం, జలాభిషేకం తదితర విశేషపూజలు జరిపించబడ్డాయి.

ఈ విశేషకార్యక్రమంలో భాగంగా ముందుగా జయంత్యోత్సవ సంకల్పం పఠించబడింది. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజ జరిపించబడింది. అనంతరం స్తోత్రపఠనతో అక్కమహాదేవి వారిని పంచామృతాలతోనూ, ఆలయప్రాంగణంలోని మల్లికాగుండ జలంతోనూ అభిషేకించి షోడశోపచారపూజ చేయడం జరిగింది. చివరగా అక్కమహాదేవి వారికి పుష్పాంజలి సమర్పించబడింది. 

కాగా 12వ శతాబ్దంలో కన్నడ ప్రాంతాన శివశరణులుగా ప్రసిద్ది పొందిన మహాభక్తులలో అక్కమహాదేవి ఒకరు. వీరవిరాగిణిగా పేరొందిన అక్కమహాదేవి, శ్రీశైలమల్లికార్జునస్వామివారిని తమ భాగస్వామిగా భావించి తరించింది. శ్రీశైల మల్లికార్జునుడిపై ఎన్నో వచనాలను చెప్పిన అక్కమహాదేవి సంస్కృత,కన్నడ భాషలలో ఎంతో ప్రవీణురాలని చెప్పబడుతోంది. కన్నడ వచన సారస్వతంలో ఈమెను విశిష్ట వచనా రచయిత్రిగా సాహితీవేత్తలు పేర్కొంటారు.  

ఇప్పటికీ అక్కమహాదేవి వచనాలు శివశరణాలనే పేరుతో ఎంతో ప్రచారంలో ఉన్నాయి. ఈ వచనాలలో మధుర భక్తే కాకుండా జ్ఞాన, వైరాగ్యాలకు సంబంధించిన ఎన్నో అంశాలు కనిపిస్తాయి. శ్రీశైల మల్లికార్జునునిలో ఐక్యం కావాలనే చిరకాలవాంఛ గల అక్కమహాదేవి తన జీవితపు చివరి రోజులను శ్రీశైలంలోనే గడిపింది. 

ప్రస్తుతం అక్కమహాదేవి గుహలుగా పిలువబడుతున్న ఇక్కడి గుహలలో కొంతకాలం తపస్సు చేసిన ఈ సాధకురాలు ఇక్కడి కదళీవనంలో మరికొంతకాలం తపస్సుచేసి, ఈ కదళీవనంలోనే సిద్ధి పొందింది. 

ఆలయప్రాంగణములోని అక్కమహాదేవివారికి ప్రతిరోజు కూడా పూజాదికాలు జరిపించబడుతున్నాయి. 

ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావు, సహాయ కార్యనిర్వహణాధికారి కె.వెంకటేశ్వరరావు, బి.మల్లికార్జునరెడ్డి, పర్యవేక్షకులు డి. రాధకృష్ణ,  అర్చకస్వాములు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 


అక్కమహాదేవి జయంతిని పురస్కరించుకుని బుధవారం ( 01.04.2026) సాయంకాలం  భ్రామరీ కళావేదిక   ( నిత్యకళారాదన వేధిక) పై అక్కమహాదేవి జీవిత విశేషాలపై      డా. ఎం. మహంతయ్య వారి  ప్రవచన కార్యక్రమము ఏర్పాటు చేయబడింది. 


( కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు)

శ్రీశైలదేవస్థానం వారి ద్వారా జారీ